Sun Feb 01 2026 04:59:41 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటయిన తర్వాత పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండటంతో ఆసక్తికరంగా మారింది. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించిన వాటికి బడ్జెట్ లో నిధులు ఏ మేరకు కేటాయిస్తారనన దానిపై రాజకీయపరిశీలకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
తొలి బడ్జెట్ ను...
శాసనసభలో తొలి బడ్జెట్ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే తొలిరోజు సభ వాయిదా వేయనున్నారు. మరుసటి రోజు నుంచి బడ్జెట్ పై చర్చ జరగనుంది. అయితే పది నుంచి పది రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశముంది. ఎన్ని రోజులు సభను నిర్వహించాలన్నది రేపు ఉదయం జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.
Next Story

