Fri Dec 05 2025 17:08:42 GMT+0000 (Coordinated Universal Time)
శివరాత్రికి శ్రీశైలం రావాలంటే కష్టమే
శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు తేదీలను నిర్ణయించారు

శివరాత్రికి శ్రీశైలం ముస్తాబు కానుంది. శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు తేదీలను నిర్ణయించారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4వ తేదీ వరకరూ శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలను కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహించనున్నారు. జ్యోతిర్లింగాల్లో మఖ్యమైన శివరాత్రి బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
ముందస్తు రిజర్వేషన్....
అయితే ఉత్సవాల సమయంలో గదుల రిజర్వేషన్లపై ఆలయ కమిటీ ఆంక్షలను విధించింది. ఉత్సవాల సమయంలో గదుల కోసం ముందస్తు రిజర్వేషన్లు ఉండవని పేర్కొంది. అయితే వసతి గదుల నిర్మాణానికి సహకరించిన దాతలకు మాత్రం రిజర్వేషన్ అవకాశం ఉంటుంది. ఎవరైనా ముందస్తుగా గదులను రిజర్వ్ చేసుకోవాలంటే వచ్చే నెల పదో తేదీలోగా లిఖితపూర్వకంగా కార్యాలయానికి అందజేయాల్సి ఉంటుంది.
Next Story

