Tue Jan 20 2026 11:38:04 GMT+0000 (Coordinated Universal Time)
పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత.. ఎవరిపై దాడి జరిగిందంటే?
పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత

పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల కాన్వాయ్‌పై టీడీపీ నేతలు దాడికి దిగారు. కర్రలతో వైసీపీ నేతల కార్లపై దాడి చేయడంతో ఒక కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు.
పెదకూరుపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వరద ముంపు గ్రామాల పరిశీలనకు వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ కారణంగా 14వ మైలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ముంపు ప్రాంత బాధితులను పరామర్శించడం తప్పా అని నంబూరు శంకర్రావు ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగిందని ఆరోపించారు. ఇదంతా ప్లాన్ ప్రకారం చేసిన దాడి అంటూ వ్యాఖ్యలు చేశారు
Next Story

