Thu Nov 30 2023 14:24:49 GMT+0000 (Coordinated Universal Time)
అచ్చెన్నాయుడు పిలుస్తున్నారు.. సీఎం జగన్ వెళ్లేనా?
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం చూపించగలిగే దమ్ము, ధైర్యం జగన్‌రెడ్డికి ఉందా? చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఒక్క రూపాయి అందినట్లు జగన్‌రెడ్డి నిరూపించగలడా? అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై నేషనల్ మీడియాలో చేసిన ఛాలెంజ్‌ను తీసుకునే దమ్ము, ధైర్యం వైసీపీ అధినాయకత్వానికి ఉందా? అని అన్నారు అచ్చెన్నాయుడు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ఢిల్లీ వచ్చి జాతీయ మీడియాలో చర్చించే దమ్ము ఉందా? జగన్‌రెడ్డికి నచ్చిన జాతీయ టీవీ ఛానెల్లో డిబేట్‌కు రావాలని ఛాలెంజ్ చేస్తున్నామన్నారు కింజరాపు అచ్చెన్నాయుడు.
చంద్రబాబుకు వస్తున్న సానుభూతిని, రాష్ట్ర ప్రజల స్పందనను చూసి వైసీపీ నాయకులకు ప్యాంట్లు తడిసిపోతున్నాయన్నారు అచ్చెన్న. అందుకే ప్రతిపక్షనాయకులపై, పవన్ కళ్యాణ్‌పై విమర్శల దాడి చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు బ్రతికే పరిస్థితులు లేవు. పవన్‌కళ్యాణ్ జైలుకు వెళ్లి చంద్రబాబును కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని అన్నారు పవన్ కళ్యాణ్. అవినీతి మచ్చలేని నాయకుడు చంద్రబాబుపై సిగ్గులేకుండా కేసుపెట్టి ఇంకా ప్రజల ముందుకు వచ్చి జగన్‌రెడ్డి మాట్లాడుతున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం చూపించగలిగే దమ్ము, ధైర్యం జగన్‌రెడ్డికి ఉందా? చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఒక్క రూపాయి అందినట్లు జగన్‌రెడ్డి నిరూపించగలడా? అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.
Next Story