Wed Jan 28 2026 16:31:12 GMT+0000 (Coordinated Universal Time)
అబద్ధాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ : జగన్
అబద్ధాలకు అంబాసిడర్ ఎమ్మెల్యే వైఎస్ జగన్ అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

అబద్ధాలకు అంబాసిడర్ ఎమ్మెల్యే వైఎస్ జగన్ అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ నీచ ఆరోపణల గురించి, రైతులను మోసం చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసన్న మంత్రి అచ్చెన్నాయుడు 18 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి జగన్ ఐదేళ్ల పాలన అబద్ధాలను బట్టబయలు చేసిందని వెల్లడించారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వని జగన్ కు మాట్లాడే ఆర్హతే లేదన్న అచ్చెన్నాయుడు గత ప్రభుత్వం 1674 కోట్లు ధాన్యం బకాయిలు చెల్లించకపోతే కూటమి ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు.
గత ప్రభుత్వం నిర్వాకమే...
రైతు ఆత్మహత్యల కుటుంబాలకు చెల్లించని పరిహారాలు కూటమి ప్రభుత్వం వెంటనే అందచేసిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మద్ధతు ధరల కోసం రైతులకు 16 నెలలో 800 కోట్లు ఖర్చుచేశామన్న ఆయన వాస్తవాలపై బహిరంగ చర్చకు జగన్ తో తాను సిద్ధమని సవాలు విసిరారు. రైతులను, ప్రజలను ఎప్పటికప్పుడు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే వైఎస్ జగన్ మరోసారి అబద్ధాలతో ప్రచారం చేయడం దారుణమని అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. గత ఐదేళ్ల పాటు జగన్ నడిపిన తుగ్లక్ పరిపాలనే వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయడానికి ప్రధాన కారణమన్నారు.
Next Story

