Thu Apr 09 2026 20:05:42 GMT+0530 (India Standard Time)
జగన్ ఒక సైకో : అచ్చెన్నాయుడు
జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన కామెంట్ చేశారు.

జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన కామెంట్ చేశారు. వైఎస్ఆర్ మరణానికి జగన్ మోహన్ రెడ్డి కారణమనే నాడు వ్యక్తమై అనుమానాలు నేడు నిజమని నమ్మే పరిస్థితులు వచ్చాయని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ నైజం చూస్తుంటే నాడు బొత్స చేసిన వ్యాఖ్యలు నిజమే అనిపిస్తోందంటూ కామెంట్ చేసిన అచ్చెన్న వైఎస్ చనిపోయినప్పుడు... వివేకా చనిపోయినప్పుడు లాభం పొందిన వ్యక్తి జగన్ ఒక్కరేనంటూ సీరియస్ కామెంట్ చేశారు. పదవి కోసం జగన్ మోహన్ రెడ్డి సైకో మనస్తత్వంతో వ్యవహరిస్తున్నాడంటూ అచ్చెన్న మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డికి ఇక అధికారం రాదని, ప్రజలకు జగన్ పిచ్చి చేష్టలు తెలిసిపోయాయంటూ అచ్చెన్న అన్నారు.
ఉత్తరాంధ్రలో ఏం చేశామో...
ఉత్తరాంధ్రలో ఏం చేశామో... కాలికి గజ్జె కట్టుకుని చెబుతానన్న అచ్చెన్నాయుడు ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల కుటుంబాలు, సమాజం ఎలా విధ్వంసం అవుతుందనే దానికి జగన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని తెలిపారు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో స్వర్ణయుగం లాంటి పాలన సాగిందని, 2019-24 మధ్య కాలంలో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చాడని, విధ్వంసం చేశాడన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. 22 నెలల కాలంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టామని,రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ సంపూర్ణ సహకారం అందించడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమం అమలు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు.
Next Story

