Fri Dec 05 2025 16:40:56 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆత్మకూరులో బీజేపీకి షాక్.. కౌంటింగ్ హాలు నుంచి...?
ఆత్మకూరులో ఆరో రౌండ్ ముగిసేసరికి వైసీపీకి 31,470 ఓట్లు మెజారిటీ లభించింది. బీజేపీకి అతి తక్కువ ఓట్లు పోలయ్యాయి

ఆత్మకూరులో కౌంటింగ్ ప్రారంభమయింది. ఇప్పటికి ఆరు రౌండ్లు ముగిశాయి. ప్రతి రౌండ్ లోనూ వైసీపీకే అత్యధిక ఓట్లు వచ్చాయి. ఆత్మకూరు ఆరో రౌండ్ ముగిసేసరికి వైసీపీకి 25,852 ఓట్లు మెజారిటీ లభించింది. బీజేపీ, ఇతర ఇండిపెండెంట్లకు అతి తక్కువ ఓట్లు పోలయ్యాయి. రౌండ్ రౌండ్ కు వైసీపీ ఆధిక్యం పెరుగుతుంది.
బీజేపీకి డిపాజిట్....
ఆత్మకూరు ఉప ఎన్నికలో ఐదో రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డికి 25,103 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కు 1,247 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ఓబులేుకు 228 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కౌంటింగ్ హాలు నుంచి వెళ్లిపోయారు. బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కే అవకాశం కన్పించడం లేదు.
Next Story

