Thu Dec 18 2025 13:41:46 GMT+0000 (Coordinated Universal Time)
ప్రకాశం బ్యారేజీకి వరద.. లంక గ్రామ ప్రజలకు అలెర్ట్... అప్రమత్తంగా ఉండాలి
ప్రకాశం బ్యారేజ్ వద్ద స్వల్పంగా వరద ఉధృతి పెరుగుతుంది. లంక గ్రామ ప్రజలు హైఅలెర్ట్ జారీ చేసిన ప్రభుత్వం

ప్రకాశం బ్యారేజ్ వద్ద స్వల్పంగా వరద ఉధృతి పెరుగుతుంది. కృష్ణానది వరద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.67 లక్షల క్యూసెక్కులుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరించింది.
పెరుగుతున్న వరద ఉధృతి....
పంట్లు, నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దని కోరింది. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని తెలిపింది.అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయాలని పేర్కొంది. జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు పడతారని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Next Story

