Sun Feb 01 2026 07:05:30 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్నాయి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అనంతరం శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశమవుతుంది. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏఏ అంశాలపై చర్చించాలన్న దానిపై బీఏసీ లో నిర్ణయిస్తారు.
గవర్నర్ ప్రసంగంతో...
తొలి రోజు గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు జరిగే చిట్ట చివరి సమావేశాలు కావడంతో టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలు తెలిపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరో వైపు ఈ సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదించుకునే అవకాశముంది.
Next Story

