Sat Mar 07 2026 23:47:49 GMT+0530 (India Standard Time)
అసెంబ్లీ సమావేశాలకు జగన్.. పులివెందుల పర్యటన వాయిదా
ఈనెల 21, 22 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీంతో జగన్ పులివెందుల పర్యటన వాయిదా వేసుకున్నారు

ఈనెల 21, 22 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనుననాయి.రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఈ నెల 24వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం తాజాగా మార్పు చేస్తూ ఈనెల 21, 22 తేదీల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది.
ప్రమాణ స్వీకారంతో బాటు....
రెండు రోజుల సభ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నికతో పాటు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు పేరు ఇప్పటికే ఖరారయిన నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు ముందుకు జరపడంతో జగన్ రేపటి తన పులివెందుల పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆయన తనతో పాటు ఎన్నికైన ఎమ్మెల్యేలతో కలసి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు.
Next Story

