Fri Dec 05 2025 09:22:39 GMT+0000 (Coordinated Universal Time)
బడ్జెట్ అంటే ఏమిటో వైసీపీకి తెలుసా?
వైసీపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు

వైసీపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఏడు లక్షల కోట్ల అప్పును తీర్చేందుకు ప్రజలపై పన్నుల రూపంలో భారం మోపుతుందని ఆయన ఆరోపించారు. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ అంతా హంబక్ అని ఆయన అన్నారు. బడ్జెట్ అనే పదానికి ఈ పాలకులకు అర్థం తెలియదని ఆయన అన్నారు. స్కీమ్ లు, స్కాంలతోనే ఈ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుందని ఆయన అన్నారు.
అన్నీ తనఖాలే?
ఏపీ పవర్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ను కూడా తనఖా పెట్టే స్థాయికి ఈ ప్రభుత్వం వచ్చిందని అశోక్ బాబు అన్నారు. ఉద్యోగులు పీఆర్సీ నివేదికను కోర్టు ద్వారా సాధించుకోవడంతో ప్రభుత్వం పరువు పోయిందని ఆయన అన్నారు. 97 వేల కోట్ల రూపాయలను బడ్జెట్ తో సంబంధం లేకుండా ఖర్చు చేసిందని కాగ్ వెల్లడించినా రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనడం లేదని అశోక్ బాబు ఫైర్ అయ్యారు.
- Tags
- ashok babu
- tdp
Next Story

