Sun Mar 15 2026 22:02:54 GMT+0530 (India Standard Time)
వైఎస్ఆర్సీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో వరసగా పార్టీని వీడే వారి సంఖ్య ఎక్కువగా కనపడుతుంది

పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో వరసగా పార్టీని వీడే వారి సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, గుంటూరు నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మద్దాల గిరిధర్త తన రాజీనామా లేఖను వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు.
2019 ఎన్నికల్లో...
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన మద్దాలి గిరి తర్వాత కొంత కాలానికి వైసీీపీ అనుకూలంగా మారిపోయారు. గత ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ కూడా ఇవ్వలేదు. అయితే పార్టీ అధికారంలోకి వస్తే ఏదోఒక నామినేటెడ్ పదవి వస్తుందన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. కానీ అధికారంలోకి రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు.
Next Story

