Mon Mar 16 2026 20:03:59 GMT+0530 (India Standard Time)
నేడు తిరుమలలో రద్దీ?
సోమవారం భక్తుల సంఖ్య తిరుమలలో అధికంగానే ఉండటంతో శ్రీవారి దర్శనానికి గంటల సమయం పడుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం భక్తుల సంఖ్య తిరుమలలో అధికంగానే ఉండటంతో శ్రీవారి దర్శనానికి గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఐదు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరి దర్శనానికి సమయం ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు లేకుండా ఈరోజు ఉదయం ఏడు గంటలకు క్యూ లైన్ లో ప్రవేశించే భక్తులకు స్వామి వారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
శీఘ్ర దర్శనం...
మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 79,415 మంది దర్శించుకున్నారు. వీరిలో 28,415 మంది తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.86 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

