Sun Mar 15 2026 09:20:59 GMT+0530 (India Standard Time)
నేడు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ.. రెబల్స్ బెడదతో
నామినేషన్లకు ఉపసంహరణకు చివరితేదీ నేడు కావడంతో రాజకీయ పార్టీల నేతల్లో గుబులు పట్టుకుంది

నామినేషన్లకు ఉపసంహరణకు చివరితేదీ నేడు కావడంతో రాజకీయ పార్టీల నేతల్లో గుబులు పట్టుకుంది. అనేక నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా అనేక మంది బరిలో ఉన్నారు. వీరి నామినేషన్లను ఉపసంహరించడానికి పార్టీ అగ్రనేతలు కూడా అనేక ప్రయత్నాలు చేశారు. ఈరోజునామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజు కావడంతో ఈరోజు ఉపసంహరించుకోకుంటే వారంతా రెబల్స్ గా మారిపోయినట్లే.
ప్రధాన పార్టీలకు...
ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలకు ఈ రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. తమకు సీటు రాకపోవడంతో అనేక చోట్ల స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ముందుగా సీటు ఖరారు చేసి తర్వాత మార్చడంతోనూ మాడుగుల వంటి చోట టీడీపీ నుంచి ఇద్దరు ముగ్గురు నేతలు నామినేషన్లు వేశారు. వీరంతా నేడు ఉపసంహరించుకోకుంటే ఇబ్బంది తప్పేలా లేదు. చివరి ప్రయత్నంగా వారిని ఒప్పించి నామినేషన్లను ఉపసంహరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story

