Sat Mar 07 2026 13:36:04 GMT+0530 (India Standard Time)
అరసవిల్లికి పోటెత్తిన భక్తులు
రథసప్తమి కావడంతో అరసవిల్లి స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రథసప్తమి కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈరోజు రథసప్తమి కావడంతో ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అరసవిల్లికి క్యూ కట్టారు.
వీఐపీల రాకతో...
వీఐపీల తాకిడి కూడా ఎక్కువయింది. వీఐపీల దర్శనం కోసం క్యూ లైన్లను గంటల కొద్దీ నిలిపివేయడంతో సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వీఐపీల కోసం తమను ఆపుతారేంటని భక్తులు అధికారులను నిలదీస్తున్నారు. రూ.500 లు టిక్కెట్ తీసుకున్నా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.
Next Story

