Sun Mar 15 2026 14:09:26 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు ఐపీఎల్లో సూపర్ సండే
ఆదివారం కావడంతో నేడు ఐపీఎల్లో రెండు మ్యాచ్లు జరగనున్నాయి.

ఆదివారం కావడంతో నేడు ఐపీఎల్లో రెండు మ్యాచ్లు జరగనున్నాయి. రెండు మ్యాచ్ లలో బలమైన జట్లు తలపడనున్నాయి. అందుకే ఈరోజు సూపర్ సండే. క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే. మధ్యాహ్నం నుంచే మ్యాచ్లు ప్రారంభం కానుండటంతో ఎండల సమయంలో ఇంట్లో ఉండి మ్యాచ్ లు చూసేందుకు మంచి ఛాన్స్ ఉంది. ఈరోజు ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ కాపిటల్స్ తలపడనున్నాయి. ముంబయి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో గెలుపు అవకాశాలపై అంచనాలు అనేకం ఉన్నాయి. ఇప్పటి వరకూ ముంబయి ఈ ఐపీఎల్ లో బోణీ కొట్టలేదు.
మరో మ్యాచ్...
దీంతో ఈ మ్యాచ్ లోనైనా గెలిచి సత్తా చాటాలని భావిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బలమైన చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి ఊపు మీదుంది. మరి ఈ రెండు జట్లలో గెలుపు ఎవరిది అన్నది అంచనా వేయడం చివరి క్షణం వరకూ కష్టమే.మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబయిలో ఈ మ్యాచ్ జరగనుంది. మరో మ్యాచ్ రాత్రి ఏడున్నర గంటలకు జరుగుతుంది. ఈ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కూడా అభిమానులను అలరించనుంది. రెండు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలంగా ఉండటంతో గెలుపోటములపై అంచనాలు మాత్రం అందడం లేదు.
Next Story

