Fri Dec 05 2025 09:57:13 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : రేపు సాయంత్రం సచివాలయానికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు సచివాలయానికి రానున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు సచివాలయానికి రానున్నారు. ఈరోజు సాయంత్రం ఆయనకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి బయలుదేరి చంద్రబాబు అమరావతికి చేరుకుంటారు.
తొలి సంతకం...
రేపు సాయంత్రం చంద్రబాబు సచివాలయానికి రానున్నారు. సచివాలయం మొదటి బ్లాక్ లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరిస్తారు. 4.41 గంటలకు ఛాంబర్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తారు. అనంతరం రెండో ఫైలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేయనున్నారు. వీటితో పాటు పింఛను మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతూ రూపొందించిన ఫైలుపై కూడా ఆయనమూడో సంతకం చేయనున్నారు. స్కిల్క్ డెవలెప్మెంట్ తో పాటు అన్నా కాంటీన్ల ఏర్పాటుపై కూడా ఆయన సంతకం చేయనున్నారు.
Next Story

