Fri Dec 05 2025 08:14:31 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో కొనసాగుతున్న ఆరోగ్య శ్రీ బంద్
ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ సేవల బంద్ కొనసాగుతుంది

ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ సేవల బంద్ కొనసాగుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాటు ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన బాకాయీలను విడుదల చేయకపోవడంపై ప్రయివేటు ఆసుపత్రులన్నీబంద్ లను పాటిస్తున్నాయి. ఆరోగ్య శ్రీ సేవలకు సంబంధించిన అన్నింటినీ బంద్ చేశాయి. ప్రభుత్వం ఆరోగ్య శ్రీ స్థానంలో బీమా పాలసీ తీసుకు రావడంతో తమ పరిస్థితి ఏంటన్న దానిపై బంద్ కు దిగాయి.
ముఖ్యమంత్రితో చర్చల తర్వాతే...
మరొక వైపుచర్చల తర్వాతే సేవలు తిరిగి ఆస్పత్రుల అసోసియేషన్ ప్రారంభిస్తామంటున్నాయి. పెండింగ్ లో ఉన్న రూ.674 కోట్లతో కలిపి రూ.3800 కోట్ల బకాయిలను త్వరలో చెల్లిస్తామని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ హామీ ఇచ్చినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సమావేశం జరగాలని స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ పట్టుబడుతున్నాయి. వారంరోజుల్లో ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ సీఈవో చెప్పినా తాము బంద్ కు వెళతామని ప్రకటించాయి.
Next Story

