Tue Apr 07 2026 19:38:41 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఆరోగ్య శ్రీ సమ్మెకు బ్రేక్
ఆరోగ్య శ్రీ సేవల సమ్మెకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించాయి

ఆరోగ్య శ్రీ సేవల సమ్మెకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించాయి. ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీని అనుసరించి ఎన్టీఆర్ వైద్య సేవలను తిరిగి చెల్లించేందుకు నిర్ణయించింది. బిల్ డిస్కౌంట్ విధానంలో చెల్లిస్తామని, వెయ్యి కోట్ల రూపాయలను వడ్డీతో సహా చెల్లిస్తామని, మిగిలిన పెండింగ్ బకాయీలను నెలకు 150 నుంచి 170 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
తాత్కాలిక విరామం...
దీంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఈరోజు నుంచి యధాతధంగా ఎన్టీఆర్ వైద్య సేవలు అందుతాయి. అన్ని ఆసుపత్రులతో కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు సమావేశం నిర్ణయించింది.
Next Story

