Sat Dec 06 2025 02:27:16 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : రేపు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యధాతథం
ఆంప్రదేశ్ లో రేపు జరగనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు

ఆంధ్రప్రదేశ్ లో రేపు జరగనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రచారాలను నమ్మవద్దనితెలిపారు. తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు త్వరగా చేరుకుని పరీక్ష రాయాలని కోరారు. రేపు ఉదయం పది గంటల నుంచి 12.30 గంటల వరకూ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష 1 యధాతధంగా జరుగుతుందని తెలిపారు.
మధ్యాహ్నంపరీక్ష...
అలాగే మధ్యాహ్నం నుంచి పేపర్ 2 పరీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకూ పరీక్ష జరుగుతుందని చెప్పారు. అభ్యర్థులు 15 నిమిషాలు ముందే పరీక్షా కేంద్రానికి రావాలని, గ్రూప్ - 2 మెయిన్స్ వాయిదా అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని,సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారం నమ్మవదని, తప్పుడు ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఏపీపీఎస్సీ కార్యదర్శి వార్నింగ్ ఇచ్చారు.
Next Story

