Sun Mar 15 2026 13:24:05 GMT+0530 (India Standard Time)
Ys Sharmila : నేడు కర్నూలు జిల్లాకు వైఎస్ షర్మిల
ఈరోజు కర్నూలు జిల్లాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు

ఈరోజు కర్నూలు జిల్లాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. న్యాయయాత్ర పేరిట ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. నిన్న అనంతపురం జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో పర్యటించిన వైఎస్ షర్మిల జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆమె జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
మూడు నియోజకవర్గాల్లో...
ఈరోజు ఉదయం 10 గంటలకు ఆలూరు లో బహిరంగ సభలో వైఎస్ షర్మిల పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఆదోని లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రాత్రి 7 గంటలకు ఎమ్మిగనూరు లో బహిరంగ సభ లో షర్మిల పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వరసగా మూడు నియోజకవర్గాల్లో షర్మిల సభల్లో పాల్గొననున్నారు.
Next Story

