Fri Dec 05 2025 13:37:55 GMT+0000 (Coordinated Universal Time)
రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అవసరం : వైఎస్ షర్మిల
పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ బలోపేతం చేస్తున్నామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ బలోపేతం చేస్తున్నామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతైనా ఉందన్న షర్మిలచంద్రబాబు,పవన్,జగన్ ముగ్గురు బీజేపీ కి తొత్తులేనన్నారు. ఈ మూడు పార్టీలు బీజేపీ కి బానిసలేనని, రాష్ట్ర ప్రయోజనాల మీద బీజేపీ నీ ఎదిరించే దమ్ము వీళ్లకు లేదని తెలిపారు. మోడీ ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేస్తే అడగరని, పోలవరం ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తుంటే నోరు మెదపరని వైఎస్ షర్మిల అన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎగ్గొట్టేందుకు పోలవరం ప్రాజెక్టు కు అన్యాయం చేశారని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. పోలవరం మీద బీజేపీ అన్యాయాన్ని ప్రశ్నించే దమ్ము ఈ మూడు పార్టీలకు లేదన్నారు.
ప్రత్యేక హోదా ఇస్తామని...
ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేస్తే మౌనంగా ఉంటారని, రాజధాని కి నిధులు బదులు అప్పులు ఇస్తుంటే ఇదెక్కడి అన్యాయం అని అడిగే సత్తా ఈ మూడు పార్టీలకు లేదన్నారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తున్నా మౌనంగా ఉంటానపి. రాష్ట్రానికి అన్యాయం చేసే బీజేపీకి పోటీలు పడి మద్దతు ఇస్తున్నారని, కేంద్రంలో మద్దతు ఇచ్చి మోదీని మళ్ళీ కూర్చోబెట్టాని వైఎస్ షర్మిల అన్నారు. చంద్రబాబు మొదటి ఐదేళ్లు బీజేపీని నమ్మి మోసపోయాడని, ఇప్పుడు అదే బీజేపీని గుడ్డిగా నమ్ముతున్నారన్నారని ఎద్దేవా చేశారు. పగలు పడిన గోతిలోనే చంద్రబాబు రాత్రి పడ్డాడండూ సెటైర్ వేశారు. జగన్ బీజేపీకి దత్త పుత్రుడని, బీజేపీ నీ వ్యతిరేకించే ఒక్క కార్యక్రమం కూడా జగన్ చేయరని అన్న వైఎస్ షర్మిల రాష్ట్రంలో విభజన సమస్యలు తీరాలంటే కాంగ్రెస్ అధికారంలో రావాలని అన్నారు.
Next Story

