Fri Dec 05 2025 19:37:49 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : విజయవాడలోనూ హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందే
విజయవాడలోనూ హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి బుడమేరు ఆక్రమణలను తొలగించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.

విజయవాడలోనూ హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి బుడమేరు ఆక్రమణలను తొలగించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆమె సింగ్నగర్ ప్రాంతంలో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయవాడ ముంపును కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని వైెఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
జాతీయ విపత్తుగా...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని కోరారు. చంద్రబాబు వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించి వారిలో భరోసాను నింపడాన్ని ఆమె ప్రశంసించారు. బుడమేరు రక్షణకు వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బుడమేరు ప్రాంతంలో ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైెఎస్ షర్మిల కోరారు.
Next Story

