Sat Mar 07 2026 20:09:29 GMT+0530 (India Standard Time)
ఏపీ కరోనా అప్డేట్
ఇదే సమయంలో ఒకరు కరోనా నుంచి కోలుకోగా.. గడిచిన 24 గంటల్లో కరోనా మరణం సంభవించలేదు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో..

అమరావతి : ఏపీలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం గడిచిన 24 గంటల్లో 3,116 కరోనా శాంపిళ్లను పరీక్షించగా ఒకే ఒక్క కరోనా కేసు నమోదైనట్లు వెల్లడైంది. ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఒక్క కరోనా కేసు నమోదైంది.
ఇదే సమయంలో ఒకరు కరోనా నుంచి కోలుకోగా.. గడిచిన 24 గంటల్లో కరోనా మరణం సంభవించలేదు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,730గా ఉంది. నేటి వరకూ రాష్ట్రంలో 3,35,08,244 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
Next Story

