Sat Mar 07 2026 20:06:59 GMT+0530 (India Standard Time)
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. తాజాగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది.

అమరావతి : ఏపీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. తాజాగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3,509 శాంపిళ్లను పరీక్షించగా 02 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క విశాఖపట్నం జిల్లాలో 2 కేసులు నమోదవ్వగా.. మిగతా అన్ని జిల్లాల్లో కొత్తకేసులేవీ నమోదు కాలేదు. ఇదే సమయంలో మరో నలుగురు కరోనా పేషెంట్లు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఎలాంటి కరోనా మరణాలు నమోదు కాలేదని వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
Next Story

