Sat Mar 07 2026 20:07:20 GMT+0530 (India Standard Time)
ఏపీ కరోనా అప్డేట్.. నాలుగు జిల్లాల్లో 5 కేసులు
గుంటూరు జిల్లాలో 2, తూ.గో జిల్లా, కాకినాడ జిల్లా, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైంది. ఇదే సమయంలో మరో 10 మంది..

అమరావతి : ఏపీలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో సింగిల్ డిజిట్ లోనే కొత్తకేసులు నమోదవుతుండటం.. కాస్త ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 3,221 మంది శాంపిళ్లను పరీక్షించగా.. ఐదుగురికి పాజిటివ్ గా నిర్థారణ అయింది.
గుంటూరు జిల్లాలో 2, తూ.గో జిల్లా, కాకినాడ జిల్లా, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైంది. ఇదే సమయంలో మరో 10 మంది కరోనా బాధితులు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా మరణాలేవీ సంభవించలేదు. నేటి వరకూ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,730గానే ఉంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 3,35,02,187 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
Next Story

