Sat Mar 07 2026 20:06:59 GMT+0530 (India Standard Time)
ఏపీలో కొత్తగా 4 కరోనా కేసులు
నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకూ రాష్ట్రంలో 3,030 శాంపిళ్లను పరీక్షించగా..

అమరావతి : ఏపీలో కరోనా శాంతించింది. కొద్ది రోజులుగా సింగిల్ డిజిట్ లోనే రోజువారీ కేసులు నమోదవుతుండగా.. మరణాల సంఖ్య సున్నాగా ఉంది. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకూ రాష్ట్రంలో 3,030 శాంపిళ్లను పరీక్షించగా.. నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదే సమయంలో మరో ఆరుగురు కరోనా నుంచి కోలుకున్నారు.
గత 24 గంటల్లో కరోనా మరణాలు సంభవించలేదు. కాకినాడ, ప్రకాశం, విశాఖ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 3,35,11274 శాంపిళ్లను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
Next Story

