Sat Mar 07 2026 20:08:04 GMT+0530 (India Standard Time)
ఏపీ కరోనా అప్ డేట్
ఇక గడిచిన 24 గంటల్లో ఎలాంటి కరోనా మరణమూ నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో..

అమరావతి : ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో రోజువారీ కేసులు 10కి దిగువన నమోదవుతుండటం ప్రజలకు కాస్త ఉపశమనాన్ని ఇస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 4,121 శాంపిళ్లను పరీక్షించగా.. 3 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 20 మంది కరోనా మహమ్మారి నుంచి విముక్తులయ్యారు.
ఇక గడిచిన 24 గంటల్లో ఎలాంటి కరోనా మరణమూ నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14,730 గా ఉంది. 3,34,62,024 శాంపిళ్లను పరీక్షించగా.. 23,19,586 కేసులు నమోదయ్యాయి. వారిలో 23,04,786 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 70 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు.
Next Story

