Sat Mar 07 2026 23:02:55 GMT+0530 (India Standard Time)
ఏపీలో స్వల్పంగా పెరిగిన కొత్తకేసులు, తగ్గిన మరణాలు
ఇదే సమయంలో కరోనాతో చిత్తూరులో ఒకరు, కృష్ణాజిల్లాలో మరొకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14,679కి చేరింది

ఏపీలో నిన్న నమోదైన కొత్తకేసులతో పోలిస్తే.. ఈ రోజు నమోదైన కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 27,522 శాంపిళ్లను పరీక్షించగా.. 1679 కొత్తకేసులు బయటపడ్డాయి. ఇదే సమయంలో కరోనాతో చిత్తూరులో ఒకరు, కృష్ణాజిల్లాలో మరొకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14,679కి చేరింది.
గడిచిన 24 గంటల్లో 9,598 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 23,08,622 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వారిలో 22,47,824 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 46,119 పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు.
Next Story

