Mon Jan 20 2025 06:02:52 GMT+0000 (Coordinated Universal Time)
నేడే ఏపీ పాలిసెట్ పరీక్ష.. 10 రోజుల్లో ఫలితాలు
పరీక్ష నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది పాలిసెట్ - 2022కి రాష్ట్ర వ్యాప్తంగా 1,37,371
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో నేడు పాలిసెట్ (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష జరగనుంది. ఉదయం 11 గంటలకు పరీక్ష మొదలుకానుండగా.. 10 గంటలనుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ వెల్లడించారు. పరీక్ష నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది పాలిసెట్ - 2022కి రాష్ట్ర వ్యాప్తంగా 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో మొత్తం 404 కేంద్రాల్లో పాలిసెట్ టెస్ట్ జరుగుతుందన్నారు. 11 గంటలకు పరీక్ష ప్రారంభమయ్యాక.. ఎవరినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమన్నారు. ప్రవేశ పరీక్షా ఫలితాలు 10 రోజుల్లో విడుదలవుతాయన్నారు. మూడేళ్లు పాలిటెక్నిక్ కోర్సుకు సంబంధించి.. రాష్ట్రంలో 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 29 విభాగాల్లో 70,569సీట్లు అందుబాటులో ఉన్నాయి.
Next Story