Tue Jan 20 2026 17:58:18 GMT+0000 (Coordinated Universal Time)
విజయవాడ కాలేజీలలో పోలీసులు
విజయవాడలోని పలు కళాశాలలను పోలీసులు ఖాళీ చేయించారు. సిద్ధార్ధ, పీవీపీ ఇంజినీరింగ్

విజయవాడలోని పలు కళాశాలలను పోలీసులు ఖాళీ చేయించారు. సిద్ధార్ధ, పీవీపీ ఇంజినీరింగ్ కళాశాలల్లోకి భారీగా వెళ్లిన పోలీసులు విద్యార్థులను ఇళ్లకు వెళ్లాలని కోరారు. తరగతులు లేవని చెప్పి.. కళాశాలలకు సెలవు ఇప్పించారు పోలీసులు. కళాశాలలో ఎవరూ ఉండకూడదంటూ విద్యార్థులను బయటకు పంపించారు పోలీసులు. చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని వాట్సాప్ ల్లో మెసేజ్ లు వైరల్ అవుతూ ఉండడంతో.. పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారని అంటున్నారు. విద్యార్థులు ఆందోళనలకు దిగకుండా ముందస్తుగా పోలీసుల కట్టడి చర్యలు. వివిధ కళాశాలల వద్ద భారీగా పోలీసు బలగాల మోహరింపు జరిగింది.
విద్యార్థులు ఆందోళనలకు దిగకుండా ముందస్తు కట్టడి చర్యలు తీసుకున్నారు. కళాశాలల్లో భారీగా మోహరించి, బలవంతంగా తరగతులను రద్దు చేయించారు.అంతేకాకుండా కళాశాలలకు సెలవు ఇప్పించాలని యాజమాన్యంపై ఒత్తిడి చేశారు. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

