Thu Mar 19 2026 05:27:27 GMT+0530 (India Standard Time)
ఇక చర్చలకు వెళ్లేది లేదు.. ఎపీ ఎన్జీవోలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇక చర్చలకు వెళ్లేది లేదని ఎపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇక చర్చలకు వెళ్లేది లేదని ఎపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైనట్లు సంకేతాలు ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం ఏపీ ఎన్జీవో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు.
జీవోలను రద్దు చేస్తేనే?
ప్రభుత్వం చర్చలకు పిలిచి తమను మోసం చేసిందని, ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వెంటనే రద్దు చేసేంత వరకూ తాము చర్చలకు వెళ్లేది లేదని బండి శ్రీనివాసరావు తెలిపారు. కాగా మధ్యాహ్నం మూడు గంటలకు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ మీడియా సమావేశంలో ఉద్యోగుల పీఆర్సీ పై ఆయన స్పష్టత ఇచ్చే అవకాశముంది.
Next Story

