Thu Mar 19 2026 09:48:18 GMT+0530 (India Standard Time)
ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు
ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని ఎపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హెచ్చరించారు.

ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని ఎపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హెచ్చరించారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని ఆయన కోరారు. ముఖ్యమంత్రి జగన్ ను మంత్రులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఎప్పటి నుంచో కోరుతున్నామన్నారు.
పాత జీతాలనే....
తాము పాత జీతాలను చెల్లించమనే కోరుతున్నా ప్రభుత్వం పట్టుదలకు పోయి ఉద్యోగులపై వత్తిడి తెస్తుందని బండి శ్రీనివాసరావు ఆరోపించారు. పాత జీతలు చెల్లించి, పీఆర్సీ పై ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేస్తేనే తాము చర్చలకు వస్తామని ఆయన తేల్చి చెప్పారు. లేకుంటే సమ్మెకు వెళతామని ఆయన హెచ్చరించారు.
Next Story

