Sun Mar 08 2026 05:43:37 GMT+0530 (India Standard Time)
విధేయత చాటుకున్న కొత్తమంత్రులు.. జగన్ కు పాదాభివందనం చేసి..
మంత్రి నారాయణ స్వామి, ఉషశ్రీ చరణ్ లు సీఎం పాదాలకు నమస్కరించారు. గుడివాడ అమర్నాథ్, జోగి రమేశ్ లు మాత్రం కాస్త ఎక్కువ..

వెలగపూడి : ఏపీ కొత్త మంత్రులుగా గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు సీఎం జగన్ పట్ల తమకున్న విధేయతను చాటుకున్నారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్ వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. జగన్ చేతులను ముద్దాడి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారానంతరం కొందరు మంత్రులు గవర్నర్, సీఎం కు నమస్కరించి వెళ్లిపోగా.. కొందరు మాత్రం జగన్ కు పాదాభివందనం చేయడం విశేషం.
మంత్రి నారాయణ స్వామి, ఉషశ్రీ చరణ్ లు సీఎం పాదాలకు నమస్కరించారు. గుడివాడ అమర్నాథ్, జోగి రమేశ్ లు మాత్రం కాస్త ఎక్కువ విధేయతనే చూపించారని చెప్పాలి. మోకాళ్లమీద వంగి జగన్ కాళ్లకు నమస్కరించారు. అలాగే ఆర్కే రోజా ప్రమాణం చేసిన తర్వాత.. జగన్ వద్దకు వెళ్లి కాళ్లు మొక్కారు. ఆయన చేతిని ముద్దాడారు. గవర్నర్ కు గౌరవ నమస్కారం చేసి వెళ్లిపోయారు. ఇలా కొత్తమంత్రులు తమ విధేయతను చాటుకున్నారు. కొత్తమంత్రులు జగన్ కాళ్లు మొక్కుతున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Next Story

