Fri Dec 05 2025 14:37:22 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం జగన్ ను కలిసిన ఏపీ నూతన డిజిపి
ఏపీ నూతన డీజీపీ గా నియమితులైన కె. రాజేంద్ర నాథ్ రెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా

ఏపీ నూతన డీజీపీ గా నియమితులైన కె. రాజేంద్ర నాథ్ రెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపిగా నియమితులైన రాజేంద్రనాథ్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలకు విఘాతం కలుగకుండా చూడాలని సీఎం జగన్ సూచించారు. అంతకుముందు మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ కూడా సీఎంతో భేటీ అయ్యారు. గౌతమ్ సవాంగ్ కేంద్ర సర్వీసులకు వెళ్లనున్న నేపథ్యంలోనే ఆయనను బదిలీ చేశారు. సవాంగ్ గతంలోనే కేంద్ర సర్వీస్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇప్పుడు ఆ అవకాశం దక్కింది.
Next Story

