Fri Dec 05 2025 20:58:42 GMT+0000 (Coordinated Universal Time)
మంచి మనసుందని ప్రూవ్ చేసుకున్న ఏపీ మంత్రులు
ఏపీ క్యాబినెట్ లో చోటు సంపాదించి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుడివాడ అమర్నాథ్ మానవతా దృక్పథాన్ని ప్రదర్శించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నం నుంచి అనకాపల్లి వైపు కాన్వాయ్ వెళ్తుండగా.

ఏపీ క్యాబినెట్ లో చోటు సంపాదించి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుడివాడ అమర్నాథ్ మానవతా దృక్పథాన్ని ప్రదర్శించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నం నుంచి అనకాపల్లి వైపు కాన్వాయ్ వెళ్తుండగా.. లంకెలపాలెం వద్ద ఓ బైక్ ప్రమాదానికి గురైనట్లు గమనించారు. వెంటనే కాన్వాయ్ ఆపేసి, సొంత వాహనంలో బాధితులను ఆస్పత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన సేవలు అందించాలని ఆస్పత్రి సిబ్బందిని ఆదేశించారు. ఇద్దరు బాధితులు గాయాలతో ఉండడం గమనించిన ఆయన వెంటనే స్పందించారు. తన కాన్వాయ్ ఆపించి, వారిద్దరిని తన వాహనంలోనే ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. వారిద్దరికీ మెరుగైన చికిత్స అందజేయాలంటూ ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. మంత్రి చర్య పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాలో అడుగుపెట్టగా.. జిల్లా ఎమ్మెల్యేలు, వైసీపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి ముత్యాలనాయుడు భారీ ర్యాలీ నేషనల్ హైవేపై వెళ్తుండగా అనకాపల్లి- యలమంచిలి మధ్య అంబులెన్స్ చిక్కుకొని పోయింది. దీంతో తాళ్లపాలెం వద్ద స్వయంగా మంత్రి ముత్యాలనాయుడు పోలీసులను వెంటనే అప్రమత్తం చేశారు. ర్యాలీని ఆపించి మరీ అంబులెన్స్ ముందుకు వెళ్లేందుకు జనాన్ని క్లియరెన్స్ ఇప్పించారు.
Next Story

