Sun Jan 19 2025 23:16:57 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ను చూసి కుళ్ళుకుంటున్న పవన్.. అందుకే
పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే.. జగన్ పై ఆయన కడుపుమంట, ఆయన జెలసీ
పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే.. జగన్ పై ఆయన కడుపుమంట, ఆయన జెలసీ ఎంత పెరిగిపోతుందో స్పష్టంగా అర్ధమవుతుందన్నారు మంత్రి రోజా. తనకన్నా చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు ప్రజల్లో అభిమానం పెరిగిపోతుందని.. దేశంలో ఆయన క్రేజ్ ఎంత పెరుగుతుందో చూసి సహించలేని పవన్ కళ్యాణ్ దారుణంగా మాట్లాడుతున్నాడని అన్నారు. భూమి పేలిపోవాలి.. రుషికొండ మునిగిపోవాలి.. జగన్ సమాధి కావాలి అని మాట్లాడాడు అంటే.. ఈయన కడుపుమంటతోనే గుండెలు పగిలేలా అరిచి అరిచి చచ్చిపోతాడేమో.. అని భయమేస్తుందన్నారు. సీఎం జగన్ ని రిక్వెస్ట్ చేసి ఆరోగ్యశ్రీ కింద పవన్ కళ్యాణ్ ను కడుపుమంటల కళ్యాణ్ అనే ప్రోసిజర్ కింద ట్రీట్మెంట్ ఇచ్చి ఆ కడుపుమంటను చల్లార్చామని కోరతామన్నారు. అప్పటికి చల్లారకపోతే హైదరాబాద్ లోని ఎర్రగడ్డలో జాయిన్ చేయాలనీ కోరుతున్నామని రోజా మండిపడ్డారు.
విశాఖపట్నంలోని రుషికొండ నిర్మాణాలపై అన్నిరకాల అనుమతులు ఉన్నాయని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా చెప్పుకొచ్చారు. రుషి కొండ నిర్మాణాలకు సంబంధించి కేంద్ర అటవీశాఖ మార్చి 12, 2021న అనుమతి ఇచ్చిందని, అత్యంత ముఖ్యమైన CRZ పర్మిషన్ ను మే 19, 2021న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. ఈ రెండు అనుమతులు వచ్చిన తర్వాతనే స్థానిక ప్రభుత్వ శాఖలు, విభాగాలు మిగిలిన అనుమతులు ఇచ్చాయని అన్నారు. ఫైర్ సేఫ్టీ పర్మిషన్, జీవీఎంసీ నుంచి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్తో పాటు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి CFC పర్మిషన్ కూడా వీటికి ఉందని అన్నారు. ఇవన్నీ తీసుకున్న తర్వాతనే 2021 సెప్టెంబరులో చట్టబద్ధంగా ఈ భవనాల నిర్మాణం ప్రారంభం అయిందన్నారు. తీసుకోవాల్సిన అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాత, రిషికొండలో కడుతున్న బిల్డింగులకు ఎలాంటి పర్మిషన్లు లేవంటూ ప్రతిపక్షాలు మాట్లాడడం అర్థరహితమన్నారు.
Next Story