Sun Mar 15 2026 10:54:07 GMT+0530 (India Standard Time)
త్రీ క్యాపిటల్స్ పై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతులు, టీడీపీ వేరు కాదని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతులు, టీడీపీ వేరు కాదని ఆయన అన్నారు. సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందుల వల్లనే మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని రైతులు పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర సాగుతుందని పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు మంత్రి వర్గ సమావేశానికి హాజరుకాలేదు.
చిత్తూరులో ఉన్న....
ఆయన చిత్తూరు జిల్లాలో వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే తనకు తెలిసినంత వరకూ మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేయడానికి సాంకేతిక సమస్యలే కారణం కావచ్చాన్నారు. రాజధాని రైతుల ఆందోళనకు భయపడి ప్రభుత్వం వెనక్కు తగ్గిందనుకోవడం లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story

