Sat Mar 07 2026 21:02:13 GMT+0530 (India Standard Time)
మంత్రి దాడిశెట్టి రాజీ సంచలన కామెంట్స్
ఏపీ మంత్రి దాడిశెట్టి రాజీ సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ ప్లీనరీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ మంత్రి దాడిశెట్టి రాజీ కాకినాడలో సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ ప్లీనరీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు వైసీపీ నియమించిన బచ్చాగాళ్లు అని ఆయన అన్నారు. వాలంటీర్లు మనపైన పెత్తనం చేస్తే ఊరుకోవద్దని ఆయన అన్నారు. వాలంటీర్లను మనం నియమించిన వాళ్లేనని నచ్చకపోతే వెంటనే వారిని తీసేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు.
సెక్రటేరియట్ లను...
వైసీపీ కార్యకర్తలు గ్రామ సెక్రటేరియట్ లను తమ కంట్రోల్ లోకి తీసుకుని నడిపించాలని రాజా కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. కార్యకర్తలకు తాను ఏ సమయంలోనూనా అందుబాటులో ఉంటానని దాడిశెట్టి రాజా తెలిపారు. కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని కూడా ఆయన అన్నారు.
Next Story

