Wed Dec 10 2025 04:59:49 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : సుందర్ పిచాయ్ తో లోకేశ్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో సమావేశమయ్యారు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో సమావేశమయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న లోకేశ్ వివిధ సంస్థల సీఈవోలను, పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. విశాఖపట్నంలో గూగుల్ ప్రతిపాదించిన 15 బిలియన్ డాలర్ల AI డాటా సెంటర్ పురోగతిని ఈ భేటీలో సమీక్షించారు. అమెరికాకు వెలుపల ఉన్న అతిపెద్ద ఎఫ్‌డీఐ ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు థామస్ కూరియన్, బికాష్ కోలే సమావేశంలో పాల్గొన్నారు. భారీ పెట్టుబడి పెట్టినందుకు లోకేశ్ ఈ సందర్భంగా లోకేశ్ ధన్యవాదాలు తెలియజేశారు.
ఏపీలో పెట్టుబడులు...
ప్రాజెక్టు టైమ్‌లైన్‌లను మరింత వేగంగా ముందుకు తేవడానికి మార్గాలపై చర్చించారు. రాష్ట్రం అభివృద్ధి చేస్తున్న డ్రోన్ సిటీలో డ్రోన్ అసెంబ్లీ, కాలిబ్రేషన్, టెస్టింగ్ సదుపాయాల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని గూగుల్‌ను ఆయన ఆహ్వానించారు. అలాగే ఏపీ వేగంగా పెరుగుతున్న సర్వర్ మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్‌లో కంపెనీ మరింతగా భాగస్వామ్యం కావాలని కోరారు. అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్‌తో జరిగిన భేటీలో, లోకేశ్ విశాఖలో గ్లోబల్ కెపబిలిటీ, డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించారు. ఫాబ్లెస్ డిజైన్, అడ్వాన్స్డ్ రీసెర్చ్, ఇంజినీరింగ్ రంగాల్లో లోతైన భాగస్వామ్యంపై చర్చించారు. రాష్ట్రంలోని ప్రపంచస్థాయి ఏఎంటీజడ్, ఫార్మా జోన్లను ముఖ్యంగా ప్రస్తావించిన లోకేశ్, ఆరోగ్య సాంకేతికత–లైఫ్ సైన్సెస్ పెట్టుబడులను పరిశీలించాలంటూ అడోబ్‌ను కోరారు.
Next Story

