Sat Dec 06 2025 09:17:46 GMT+0000 (Coordinated Universal Time)
సభలో ఆ విషయాలు చెబితే మేమూ వింటాం
భారతీయ జనతా పార్టీపై ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు

భారతీయ జనతా పార్టీపై ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజాగ్రహ పెట్టి ప్రజలకు ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటకరిచండం లేదని చెబుతారా? అని స్పీకర్ తమ్మినేని సీతారాం నిలదీశారు. ప్రత్యేక హోదా, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తామని మాట తప్పిన విషయాన్ని కూడా ఈ సభలో ప్రస్తావిస్తారా? అని తమ్మినేని ఎద్దేవా చేశారు.
వీటి గురించి....
ఎందరో మహనీయుల త్యాగాలతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరిస్తామంటే కడుపు మండి పోతుందన్నారు. తాను ఒక విద్యార్థిగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై నాడు పోరాటంలో పాల్గొన్నానని తమ్మినేని సీతారాం గుర్తు చేశారు. విభజన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో బీజేపీ నేతలు ఈ సభలో ప్రస్తావించాలని అన్నారు. ఆ విషయాలను ఈరోజు జరిగే సభలో చెబితే తాము కూడా వింటామని తమ్మినేని సీతారాం అన్నారు.
Next Story

