Fri Dec 05 2025 19:53:41 GMT+0000 (Coordinated Universal Time)
8 నుంచే ఉద్యమంలోకి
ఈ నెల 8నుంచి ఏపీలో ఉద్యోగ సంఘల ఉద్యమం ప్రారంభం కాబోతుందని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు

ఈ నెల 8నుంచి ఏపీలో ఉద్యోగ సంఘల ఉద్యమం ప్రారంభం కాబోతుందని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. తమ డిమాండ్లను సాధించుకోవడానికి ఐక్యంగా పోరాడతామని తెలిపారు. తాము ఇప్పటికే ఉద్యమ కార్యాచరణను ప్రకటించామని, దాని ప్రకారమే తాము ముందుకు వెళతామని చెప్పారు. దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు చేసి ప్రభుత్వం దిగివచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని బొప్పరాజు తెలిపారు.
కమిటీలతో కాలయాపన...
ఈ ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేయాలని ప్రయత్నిస్తుందన్నారు. ఐఆర్ 27 శాతం ప్రకటించడమే కాకుండా ఫిట్మెంట్ 23 శాతానికి తగ్గించారని ఉద్యోగులంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. తమకు ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదని, అదే సమయంలో తమ డిమాండ్ల సాధన కూడా తమకు ముఖ్యమని తెలిపారు. డీఏ అరియర్స్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కుతీసుకున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. తమ ఆందోళనలకు ప్రజల నుంచి కూడా మద్దతు లభించాలని ఆయన ఆకాంక్షించారు.
Next Story

