Thu Mar 12 2026 10:03:26 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఏపీలో హోటల్స్ అసోసియేషన్కీలక నిర్ణయం.. ప్రతి సోమవారం బంద్
తో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. స్టార్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసరంగా విజయవాడలో సమావేశమైంది. గ్యాస్ కొరతతో పాటు పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల పట్ల హోటల్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోతే హోటళ్లను ఎంతకాలం మూసి ఉంచాల్సి వస్తుందనే అంశంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు రేపటి నుంచే గ్యాస్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని, అందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అసోసియేషన్ నిర్ణయించింది.
త్వరలో నిలిపివేస్తామని...
గ్యాస్ పొదుపు చర్యల్లో భాగంగా స్టార్ హోటళ్లలో జుమాటో, స్విగ్గీ వంటి ఆన్లైన్ ఆర్డర్లను త్వరలోనే నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. గ్యాస్ ఆదా చేసేందుకు ప్రతి సోమవారం రెస్టారెంట్లను పూర్తిగా మూసివేసి, 'వీక్లీ హాలిడే' ప్రకటించనున్నారు. దీనివల్ల కొంతవరకు గ్యాస్ ఆదా అవుతుందని వారు భావిస్తున్నారు. కర్ణాటక తరహాలో ఏపీలోనూ కొన్ని హోటల్స్ కేవలం టీ, కాఫీలు మాత్రమే విక్రయించే పరిస్థితి రాబోతోందని పేర్కొన్నారు. రాత్రి 10 గంటల వరకే రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లను నడిపేలా సమయం కుదించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు.
ప్రతి సోమవారం హోటళ్లు మూసివేత...
బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ను ఏర్పాటు చేయాలని, డొమెస్టిక్ గ్యాస్ మాదిరిగానే కమర్షియల్ గ్యాస్‌ను కూడా సరఫరా చేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్‌లను కలిసి వినతిపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఆతిథ్య రంగంపై ఆధారపడిన వేల మంది కార్మికులు వీధిన పడకుండా చూడాలని, హాస్పిటాలిటీ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం లో. విజయవాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమణరావు.. ఏపీ స్టార్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వీ స్వామి...ఇతర ప్రతినిధులు.. హోటళ్ల యజమానులు పాల్గొన్నారు
రెండు రోజుల్లో స్విగ్వీ, జొమాటో బంద్...
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల్లో స్విగ్గి, జోమోటో బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఇరాన్ యుద్ధం... గ్యాస్ కొరత నేపథ్యంలో ఏపీ హోటల్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.ముందు డిస్కౌంట్స్ తీసివేస్తామన్న అసోసియేషన్ ప్రతినిధులు తరువాత స్విగ్గి, జోమోటో సేవలను బంద్ చేస్తామని చెప్పింది. ఇక ప్రతి సోమవారం హోటల్స్ బంద్ చేయాలని నిర్ణయించినట్లు హోటల్స్ అసోసియేషన్ తెలిపింది. వాణిజ్య సిలిండర్ల కొరతతో ఈ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, పరిస్థితి తీవ్రతను బట్టిమరింతగా చర్యలు తీసుకుంటామని అసోసియేషన్ ప్రకటించింది.
Next Story

