Fri Dec 05 2025 15:43:38 GMT+0000 (Coordinated Universal Time)
నారా లోకేశ్ కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్ కు ఏపీ హైకోర్టు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్ కు ఏపీ హైకోర్టు స్వల్ప ఊరటను ఇచ్చింది. ఈ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ ను ఈ నెల 12 వరకు కోర్టు పొడిగించింది. లోకేశ్ కు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఈరోజుతో ముగియనుంది. అప్పటి వరకు వరకు లోకేశ్ ను అరెస్ట్ చేయవద్దని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవని, అందువల్ల వచ్చే బుధవారానికి విచారణను వాయిదా వేయాలని కోర్టును ఆయన కోరారు. దీంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు లోకేశ్ కు భద్రతను కల్పించాలని ఆదేశించింది.
నారా లోకేశ్ యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. నారా లోకేశ్ రేపు ఢిల్లీ నుంచి రాజమండ్రి, విజయవాడ రానున్నారని తెలిపారు. రెండు రోజుల్లో జనసేనతో పాటు కలిసి పని చేసే కమిటీ సభ్యుల పేర్లు ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. అలాగే వచ్చే సోమవారం వరకూ చంద్రబాబుకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారని అచ్చెన్నాయుడు తెలిపారు.
Next Story

