Wed Jan 21 2026 04:04:20 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu :పెట్టుబడులు పెట్టండి.. ఏపీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం
దావోస్ పర్యటనలో ఆంధప్రదేశ్ కు పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ప్రయత్నిస్తుంది

దావోస్ పర్యటనలో ఆంధప్రదేశ్ కు పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ప్రయత్నిస్తుంది. గత రెండు రోజుల నుంచి వివిధ సంస్థలు పారిశ్రామికవేత్తలతో సమావేశమయింది. ఏపీలో ఉన్న అనుకూలతలను వివరిస్తూ వారిని పెట్టుబడులను పెట్టేందుకు రాష్ట్రానికి ఆహ్వానిస్తుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూసిన తర్వాత మాత్రమే ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఏపీకి దాదాపు వెయ్యి కిలోమీటర్లకు పైగానే సముద్ర తీరం ఉందని, పోర్టులు, ఎయిర్ పోర్టులున్నాయని, ఎగుమతులకు అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలాున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
పది లక్షల కోట్ల పెట్టుబడులు...
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో 2029 నాటికి పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు విద్యా మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. మంగళవారం స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికరౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ‘సస్టైనబిలిటీ అట్ స్కేల్: గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్కు మార్గం’ అనే అంశంపై జరిగిన ఈ సమావేశాన్ని సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించారు.క్లీన్ ఎనర్జీ రంగంలో ఇప్పటికే రూ.5.22 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని లోకేష్ చెప్పారు. వీటితో పునరుత్పాదక ఇంధనం, అనుబంధ రంగాల్లో 2.7 లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
డేటా సెంటర్లకు కూడా...
సస్టైనబిలిటీని మూడు కోణాల్లో పరిశీలిస్తున్నామని లోకేష్ తెలిపారు. మొదటిది ఐటీ రంగం. రాష్ట్రంలో 6 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటికి కాలుష్య రహిత విద్యుత్ అందించేందుకు 24 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. రెండో ప్రాధాన్యం ఉద్యోగాల సృష్టి కాగా, మూడో ప్రాధాన్యం సమగ్ర క్లీన్ ఎనర్జీ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడమేనన్నారు. సీఐఐ వేదికగా గతేడాది కుదిరిన అవగాహన ఒప్పందాల ద్వారా క్లీన్ ఎనర్జీ రంగంలో రూ.5.22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో క్లీన్ ఎనర్జీ రంగంలో మూడు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇతర రంగాల ద్వారా మొత్తం 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని చేరుకుంటామని లోకేష్ తెలిపారు.
Next Story

