Fri Dec 05 2025 13:38:46 GMT+0000 (Coordinated Universal Time)
మేకపాటి మంత్రిత్వ శాఖలు బుగ్గనకు : గవర్నర్ ఆమోదం
ఆయన మృతి వైసీపీతో పాటు ఏపీకి తీరని లోటని సీఎం జగన్ సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. తాజాగా మేకపాటి నిర్వర్తించిన మంత్రిత్వ..

అమరావతి : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి వైసీపీతో పాటు ఏపీకి తీరని లోటని సీఎం జగన్ సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. తాజాగా మేకపాటి నిర్వర్తించిన మంత్రిత్వ శాఖలను ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ప్రతిపాదనలు పంపగా.. ఆయన ఆమోదం తెలిపారు.
బుగ్గన రాజేంద్రనాథ్ ఇప్పటి వరకూ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, శాసన సభ వ్యవహారాలతో పాటు వాణిజ్య పన్నుల శాఖలను చూసుకుంటున్నారు. అదనపు బాధ్యతలతో ఇకపై పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖలను కూడా బుగ్గన రాజేంద్రనాథ్ పర్యవేక్షించనున్నారు.
Next Story

