Sun Mar 08 2026 15:07:33 GMT+0530 (India Standard Time)
నేడు కడప జిల్లాకు గవర్నర్
ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని సందర్శించనున్నారు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని సందర్శించనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు అమీన్ పీర్ దర్గాను గవర్నర్ దర్శించుకుని ప్రార్థనలు చేయనున్నారు.
తిరుపతికి చేరుకుని...
అక్కడి నుంచి నేరుగా తిరుపతికి బయలుదేరి వెళతారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం గవర్నర్ తిరుపతికి వెళుతున్నారు. తిరుపతిలో యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. తిరుమలకు వెళ్లి శ్రీవారిని కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకుంటారు.
Next Story

