Thu Mar 19 2026 05:51:13 GMT+0530 (India Standard Time)
సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్ లేఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. అమరావతి పై వేసిన కేసులన్నింటినీ త్వరితగతిన విచారించాలని కోరింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. అమరావతి పై వేసిన కేసులన్నింటినీ త్వరితగతిన విచారించాలని కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి లేఖ రాసింది. ఈ నెల6న మెన్షన్ లిస్ట్ లో చేర్చాలని కోరింది. రాజధాని కేసును వెంటనే విచారించాలని కోరింది. హైకోర్టు తీర్పుపై స్టే ను ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
త్వరితగతిన విచారణ చేయాలని...
జనవరి 31న విచారణ జరగాల్సి ఉన్నా ఈ నెల 6వ తేదీన లిస్ట్ లో మెన్షన్ చేయాలని కోరింది. కేసుకున్న ప్రాధాన్యత దృష్ట్యా త్వరితగతిన విచారించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. విచారణ తేదీలను ఖరారు చేసి త్వరితగతిన విచారణను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.
Next Story

