Fri Jun 20 2025 10:02:32 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఏప్రిల్ లో ఇంటర్ పరీక్షలు ?
ఏపీ ప్రభుత్వం కూడా ఇంటర్ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామని

ఇంటర్ విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గరపడుతోంది. తెలంగాణలో ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా ఇంటర్ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామని గతంలోనే రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read : గుడ్ న్యూస్.. ఈ నాణేలు చెల్లుతాయి
తాజాగా.. ఇంటర్ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరో రెండు, మూడ్రోజుల్లో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారం నుంచే ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇక మార్చిలో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు సమాచారం.
Next Story