Fri Dec 05 2025 11:28:11 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ హయాంలో మద్యం విధానంపై సిట్.. అందుకేనా?
గత ప్రభుత్వం అవలంబించిన మద్యం విధానంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసింది.

గత ప్రభుత్వం అవలంబించిన మద్యం విధానంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసింది. వైఎస్ జగన్ హయాంలో మద్యం పంపిణీలో భారీ కుంభకోణంలో జరిగిందని నాడు ప్రతిపక్షంగా ఉన్న కూటమి నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇందులో నిజానిజాలను తేల్చేందుకు స్పెషల్ ఇన్విస్టిగేషన్ కమిటీని వేసింది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ఈకమిటీని నియమించింది.
మద్యం విక్రయాలపై...
2019 నుంచి 2024 మార్చి వరకూ మద్యం విక్రయాలు, అప్పటి ప్రభుత్వం అనుసరించిన విధానంపై లోతుగా అధ్యయనం చేసి ఏ స్థాయిలో డబ్బులు చేతులు మారాయో నిగ్గు తేల్చేందుకు ఈ కమిటీని నియమించింది. ఇప్పటికే మద్యం విధానంపై గత ఏడాది సెప్టంబరు 23వ తేదీన సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సిట్ విచారణ పురోగతిని వివరించాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులుగా ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు మరో ఐదుగురిని నియమించింది.
Next Story

